Sunday, September 8, 2024

Patancheru – బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహీపాల్ రెడ్డి ఇంట్లో ఈడి సోదాలు

పఠాన్ చేరు ప్రభ న్యూస్ పటాన్ ‌చెరు ఎమ్మెల్యే గూడెం మహీపాల్ రెడ్డి ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే మహీపాల్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు ఇంట్లోనూ తెల్లవారుజాము నుంచి సోదాలు జరుగుతున్నాయి. అందిన సమాచారం మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈ దాడులు నిర్వహిస్తున్నారని తెలిసింది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి మహీపాల్ రెడ్డి గెలిచారు.

ఉదయం నుంచే సోదాలు…

అయితే ఏ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలను నిర్వహిస్తున్నారన్న విషయం మాత్రం తెలియరాలేదు. ఉదయం నుంచే బృందాలుగా విడిపోయి ఈడీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా ఎమ్మెల్యే జిఎంఆర్ ఇంట్లో జరుగుతున్న ఈడి సోదాలు పటాన్చెరువు నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారాయి

- Advertisement -

.

Advertisement

తాజా వార్తలు

Advertisement