Thursday, November 21, 2024

Vikarabad: రైలు ఫ్లాట్ ఫామ్ మ‌ధ్య‌లో ప్ర‌యాణీకులు….రెండు గంట‌లు ప్ర‌త్య‌క్ష న‌ర‌కం

వికారాబాద్ రైల్వే స్టేషన్ లో పెను ప్రమాదం తప్పింది. కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు. రాయచూర్‌కు చెందిన సతీశ్‌ వికారాబాద్‌ రైల్వే స్టేషన్‌కు వచ్చాడు. అయితే, అప్పటికే ప్లాట్‌ఫామ్‌పై నుంచి రైలు కదులుతుంది. దీంతో రన్నింగ్‌ ట్రైన్‌ను ఎక్కేందుకు అతడు ట్రై చేశాడు.

ఈ క్రమంలో అదుపు తప్పి రైలు- ప్లాట్‌ఫామ్‌ మధ్యలో ఇరుక్కుపోయాడు. ఇక, రైలు కొద్ది దూరం అతడిని లాక్కెల్లింది. వెంటనే అలర్ట్ అయిన రైల్వే సిబ్బంది, పోలీసులు. ట్రైన్ నిలిపివేశారు. తోటి ప్రయాణీకుల సహాయంతో ట్రైన్- ప్లాట్ ఫారం మధ్యలో ఇరుక్కున్న ప్రయాణీకుడు సతీశ్ ను ప్లాట్ ఫాం పగులగొట్టి బయటకు తీశారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రయాణికుడిని స్థానిక ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్​కి తరలించారు.

- Advertisement -

అయితే, ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో ప్రయాణికుడు సతీశ్ చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఘటనతో ట్రైన్‌ రెండు గంటల పాటు ఆగిపోయింది. అయితే, రైల్వే స్టేషన్ లోపల రన్నింగ్ ట్రైన్‌ ఎక్కేందుకు ప్రయత్నించినా.. దిగేందుకు ప్రయత్నించిన ప్రమాదకరమని తరచూ రైల్వే అధికారులు అనౌన్స్‌మెంట్ చేస్తుంటారు. అంతేగాక, అవగాహనా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటారు. అయినా.. కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరించి తమ ప్రాణాల పైకి తెచ్చుకుంటారు. రైలు మిస్ అవుతుందన్న హడావుడిలో సదరు ప్రయాణికుడు కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించి ప్రమాదం బారిన పడ్డాడు అని వికారాబాద్ రైల్వే స్టేషన్ అధికారులు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement