దేశానికి సేవ చేయాలనే ఆలోచనతో దేశ రక్షణలో భాగస్వాములు కావడం అభినందనీయం అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కొత్తపల్లి మండల కేంద్రంలోని స్థానిక ఫంక్షన్ హాల్ లో ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ వారు ఏర్పాటు చేసిన ఫ్రెషర్స్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… దేశ రక్షణ చేయడం అనేది పవిత్ర వృత్తి అని.. దేశ రక్షణలో తమ పిల్లలు ఉండాలని కోరుతూ మిమ్మలని శిక్షణకు పంపించిన తల్లితండ్రులకు నా ప్రణామం అన్నారు. కన్న తల్లీ దండ్రులను మనం ఏ విధంగా గౌరవిస్తామో దేశాన్ని కూడా అలాగే గౌరవించాలని అన్నారు. ఇంటర్ నుండి దేశ రక్షణలో భాగస్వాములు కావాలని బాధ్యతగా ఎదుగుతున్న మీ భవిష్యత్ గొప్పగా ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు.
తెలంగాణ రాక ముందు రాష్ట్రంలో ఉద్యోగాలు లేక వలసలు వెళ్ళే పరిస్థితి ఉండేదని, కానీ ప్రస్తుతం స్వరాష్ట్రంలో మన రాష్ట్రానికి ఇతర రాష్ట్రాల వారు ఉద్యోగాల కోసం వలసలు వస్తున్నారని తెలిపారు. కష్టపడి చేదివే వారికి తెలంగాణ ప్రభుత్వంలో ఒక ఉద్యోగం మీ కోసం ఎదురు చూస్తూ ఉంటుందని అన్నారు. చేసే వృత్తి ఎదైనా గౌరవంగా ఉండాలని, ఒకప్పుడు రాజకీయాలు అంటే గౌరవం ఉండేది కాదని నేడు ఆ పరిస్థితి పోయిందని అన్నారు. ఎమ్మెల్యే అంటే ఒక గౌరవం వచ్చిందని, నేటి యువత రాజకీయాల్లోకి ఆహ్వానిస్తున్ననని పిలుపునిచ్చారు.
ఒక డాక్టర్ ఫెయిల్ అయితే ప్రాణం పోతుందని, ఒక ఇంజినీర్ ఫెయిల్ అయితే బ్రిడ్జి కూలిపోతుందని, అదే ఒక లీడర్ ఫెయిల్ అయితే సమాజం కుప్పకూలి పోతుందని అన్నారు. అందుకే ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ నాయకుడు అయితే దేశం బాగుంటుందని అన్నారు. ఒకప్పుడు కరీంనగర్ అనగానే నేను రాను అనే పరిస్థితి నుండి నేడు హైదరాబాద్ తర్వాత రెండో గొప్ప నగరంగా తీర్చిదిద్దడం జరిగిందని అన్నారు. రేపటి తరాల కోసమే నగరాన్ని తీర్చిదిద్దుతున్నారు భవిష్యత్ అంతా మేదేనని అన్నారు.