Wednesday, November 20, 2024

75 గంటల్లోపే పార్క్ నిర్మాణం.. స్మార్ట్ సిటీ మిషన్ చాలెంజ్‌లో గ్రేటర్ వరంగల్ ఎంపిక‌

వ‌రంగ‌ల్ కార్పొరేషన్, (ప్రభ న్యూస్): స్మార్ట్ సిటీ చాలంజ్ లో భాగంగా వ‌రంగ‌ల్ న‌గ‌రంలోని 13వ డివిజన్ ఎం హెచ్ నగర్లో 75 గంటల్లోపు పార్క్ నిర్మించినందుకు గ్రేటర్ వరంగల్ కు అవార్డ్ దక్కినట్లు స్మార్ట్ సిటీ మిషన్ ప్రకటించింది. అజాద్‌కా అమృత్ మహోత్సవంలో భాగంగా స్మార్ట్ సిటీస్ మిషన్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ప్లేస్‌మేకింగ్ మారథాన్ పబ్లిక్ స్పేస్‌లను పునరుద్ధ‌ర‌ణ చేసిన‌ 75 గంటల్లోగా ఈ అవ‌కాశం క‌ల్పించింది. రెండు విడతలలో నిర్వహించిన పోటీలలో దేశవ్యాప్తంగా 143 స్మార్ట్ సిటీ నగరాలు పాల్గొనగా గెలిచిన ఉత్తమ 6 విజేతలలో గ్రేటర్ వరంగల్ నిలిచింది. వ‌రంగ‌ల్ తోపాటు భువనేశ్వర్, ఇంఫాల్, కొహిమా, శ్రీనగర్, పింప్రి-చించ్వాడ్ న‌గ‌రాలు ఈ అవార్డులను గెలుచుకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement