.నిజామాబాద్ నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యుల నిర్ల క్ష్యంతోనే రోగి మృతి చెందా డంటూరంటూ బందువులు ఆరోపణ చేస్తూ ఆసుపత్రి ఎదుట ఆందోళన వ్యక్తం చేశా రు. బోధన్ ప్రాంతంలో ఉద్మిరీ నర్సయ్య (67) అనే వ్యక్తి ఛాతీ నొప్పి రావడం తో గత నెల 24వ తేది సోమవారం అర్ద రా త్రి నిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మ గుట్ట వద్ద గల ఓ ప్రైవే ట్ ఆసుపత్రి కి తీసుకువ చ్చారు. సదరు వ్యక్తికి గుండె పోటు వచ్చిందని వైద్యు లు చెప్పి చికిత్స ప్రారంభించారు. రోగికి గుండెకు సంబంధించిన వాల్స్ మూడు బ్లాక్ కావడంతో స్టంట్ వేయాలని రోగి బంధు వులకు వైద్యులు తెలిపారనీ చికిత్సకు సంబంధించిన డబ్బు ల కోసం ఆరోగ్యశ్రీ నుంచి అప్రూవల్ వచ్చిందని రోగి బంధువులు వెల్లడించారు.
గత నెల 27వ తేదీన సదరు రోగికి స్టంట్ వేస్తామని వైద్యులు చెప్పి… కల్లబొల్లి మాటలు చెప్పి స్టంట్ వేయడానికి కాస్త వాయిదా వేశారని బందువులు పేర్కొన్నారు. కాస్త సోమవారం ఈ రోజున రోగి చనిపోయాడం టూ వైద్యులు తెలిపారని వారు వాపోయారు. గురువారం చేయాల్సిన వైద్యం ఇప్పటి వరకు ఎందుకు చేయలేదనీ ప్రశ్నించారు. ఇన్ని రోజులు వైద్యం చేస్తామంటూ కాలయాపన చేసినందుకే రోగి చనిపోయాడంటూ ఆరోపిం చారు. సరైన సమయంలో వైద్యం అందించక వైద్యులు నిర్లక్ష్యం చేయడంతోనే రోగి చనిపోయారంటు బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఆసుపత్రిలో ఎక్కడ నిర్లక్ష్యం జరగిందొ పూర్తిగా విచారణ చేపట్టి మాకు న్యాయం చేయాలని రోగి బందువులు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రోగి బంధువులకు న్యాయం జరుగుతుందో వేచి చూడాల్సిందే మరి..