హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీశ్రీస్ఆర్టీసీ) కార్గో సేవలు ఇక మరింత వేగవంతం కానున్నాయి. ఈ క్రమంలో.. టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్‌గా కార్గో సేవలు వినియోగదారుల ముందుకు రానున్నాయి. సంస్థ వైస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ ఈ రోజు శనివారం ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ‘వేగం, భద్రత, చేరువ’ లక్ష్యంతో రెండేళ్ళ క్రితం(3030 జూన్‌లో) ప్రారంభమైన ఆర్టీసీ కార్గో సేవలు అతి కొద్ది కాలంలోనే వినియోగదారులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. మొత్తం 277 బస్స్టేషన్లతోపాటు అధికారిక ఏజెంట్ల ద్వారా ప్రస్తుతం అందుబాటులో ఉన్న పార్శిల్ సేవలు, …ఇప్పటికే వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. ఆ వెసులుబాటును మరింత ఆధునీకరిస్తూ… ఆర్టీసీ మరింత మెరుగుపరచింది. మొదటి,చివరి మైల్ కనెక్టివిటీని… మరింత ఆధునీకరిస్తూ… చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో… పదకొండు రీజియన్లు, 97 డిపోల్లో… కార్గో సేవలను రీ బ్ర్రాండ్ చేసింది.
ఈ క్రమంలో ఆర్టీసీ లాజిస్టిక్‌గా వినియోగదారులకు సేవలనందించనుంది. మరింత మెరుగైన రీతిలో సేవలనందించడమే లక్ష్యంగా ఈ ఏర్పాట్లు జరుగుతున్నట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ సహా మరికొన్నిరీజియన్లలో ఈ సేవలు కొనసాగుతాయని వెల్లడించారు. ఇతర జిల్లాల్లో కూడా ఈ సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించి కసరత్తు జరుగుతోందన్నారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాల కోసం కార్గో లాజిస్టిక్ విభాగం ట్రాఫిక్ మేనేజర్‌ను 91541 97752 నంబరులో సంప్రదించాలని సజ్జనార్ కోరారు.