మోపాల్ జులై22( ప్రభన్యూస్) – మోపాల్ మండల కేంద్రంలో గ్రామపంచాయతీ కార్మికుల సమ్మెలో భాగంగా ఎండిఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించటం జరిగింది. ఈ సందర్భంగా వారి పోరాటానికి మద్దతు తెలిపిన మండల కరోబార్ అధ్యక్షులు ధర్మనంద్ మాట్లాడుతూ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గ్రామపంచాయతీ కార్మికులతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నూటికి 90 శాతం పైగా గ్రామపంచాయతీ కార్మికులు దళితులు గిరిజనులు బలహీన వర్గాలకు చెందిన వారే విధులు నిర్వహిస్తున్నారని వారి సమస్యల పట్ల అధికార ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉండటం సరైనది కాదన్నారు. గ్రామపంచాయతీ కార్మికులు సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించకపోవడం ప్రభుత్వం వైఖరి అర్థమవుతుందని విమర్శించారు. సమాజంలో ఎవరూ చేయలేని పనులను గ్రామపంచాయతీ కార్మికులు నిర్వహిస్తూ ఉంటే సన్మానాలతో మాత్రము సరిపెట్టుకోవటం సరైంది కాదని వారి వేతనాలను పెంచాలని డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో మండల నాయకులు శ్రీనివాస్, మైపాల్ శ్రీను సావిత్రి దశరతం భులక్ష్మి అజయ్ పోశెట్టి అరుణ్ ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.