భద్రాద్రి కొత్తగూడెం, ఆంధ్రప్రభ ప్రతినిధి : జిల్లాలోని లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ల పంచాయతీ కార్యదర్శి కంపాటి పుల్లయ్యను అరెస్టు చేశామని ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ తెలిపారు. లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ల పంచాయతీ పరిధిలో… ఇంటికి విద్యుత్ కనెక్షన్ నిమిత్తం ‘నో అబ్జెక్షన్’ సర్టిఫికేట్ కోసం రూ.20వేలు డిమాండ్ చేశాడు.
దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు విచారణ జరిపి పంచాయతీ కార్యదర్శి పుల్లయ్య లంయం డిమాండ్ చేసినట్లు నిర్ధారించుకుని అతడిని అరెస్టు చేశామని ఏసీబీ డీఎస్పీ రమేష్ తెలిపారు.