Monday, November 25, 2024

WGL | సీఎం సహకారంతో పాలకుర్తిని అభివృద్ధి చేస్తా.. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

చిల్లర రాజకీయాల కోసం రాలే.. అభివృద్ధి కోసం వచ్చాం…
పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి
తొర్రూరు : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో నిధులు మంజూరు చేసి పాలకుర్తి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మామిడాల యశస్వి రెడ్డి మాట్లాడుతూ… నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేసిందని, తాజాగా గ్రామాల అభివృద్ధికి సీఆర్ఆర్ నుండి రూ.22 కోట్లు, తొర్రూరు మున్సిపాలిటీ అభివృద్ధి కోసం టీఎఫ్ సీడీ నుండి రూ.5 కోట్ల నిధులు మంజూరైన‌ట్లు తెలిపారు. త్వరలో పనులు ప్రారంభిస్తామని, పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులు పూర్తి చేస్తామన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వ హ‌యాంలోనే అభివృద్ధి జరుగుతుందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్థిక దోపిడీ, ఆర్థిక నష్టం చేసి రూ.7లక్షల కోట్లు అప్పు చేసిందన్నారు. ఎంత అప్పు ఉన్నా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడన్నారు. గత ప్రభుత్వంలో అభివృద్ధి చేయని నాయకులు అభివృద్ధి గురించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. చిల్లర రాజకీయాల కోసం పాలకుర్తికి రాలేదని.. అభివృద్ధి కోసమే వచ్చామన్నారు.

ప్రజా పాలనలో ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని, ప్రజల అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వమే మీ దగ్గరికి వచ్చి పరిష్కారం చేస్తుందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు రాజకీయాలకు అతీతంగా అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుల సహకారంతో తొర్రూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి చర్లపాలెం గ్రామానికి చెందిన హనుమాండ్ల తిరుపతి రెడ్డి ఇవ్వడం జరిగిందన్నారు.

- Advertisement -

ఈ సమావేశంలో తొర్రూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ హనుమాండ్ల తిరుపతి రెడ్డి, టీపీసీసీ మాజీ సభ్యుడు కేతిరెడ్డి నిరంజన్ రెడ్డి, జిల్లా నాయకులు గంజి దేవేందర్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సుంచు సంతోష్, పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్, రూరల్ డెవలప్మెంట్ కమిషన్ డైరెక్టర్ వెంకటనారాయణ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, నాయకులు మల్లేశం గౌడ్, ధరావత్ సోమన్న, సోమిరెడ్డి, వెంకటరెడ్డి, దేవేందర్ రాజు, ప్రసాద్, వెంకన్న, తండా రవి, సాయి మల్లు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement