Friday, November 22, 2024

TS e-Challan Discount : ట్రాఫిక్ పెండింగ్ చలాన్లు చెల్లించారా… నేడే రాయితీకి ఆఖ‌రి గ‌డువు

పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువు ఇవాళ్టితో ముగియనుంది. ఇంకా మిగిలినవారు కూడా సద్వినియోగం చేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు కోరుతున్నారు. ఇదే చివరి ఛాన్స్ అని.. గడువు పెంచే అవకాశం లేదని స్పష్టం చేస్తున్నారు.పెండింగ్ లో ఉన్న చలాన్లను వెంటనే చెల్లించేందుకు తెలంగాణ రాష్ట్రంలోని వాహనదారులకు చలాన్లపై డిస్కౌంట్ ఇస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే .

అయితే పెండింగ్ చలాన్లపై ప్రకటించిన డిస్కౌంట్ ఆఫర్ నేటితో ముగియనుంది. డిస్కౌంట్ ఛాన్స్ తో పెండింగ్ చలాన్లను క్లియర్ చేసుకోవచ్చని… గడువు ముగిస్తే అలాంటి అవకాశం ఉండదని పోలీస్ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ గడువు తేదీని పొడిగించామని… ఇవాళ్టితో ముగిశాక మళ్లీ పెంచే అవకాశం లేదని స్పష్టం చేస్తున్నారు.

- Advertisement -

గతేడాది డిసెంబర్ 27 నుంచి ఈ రాయితీల చెల్లింపులు ప్రక్రియ జరుగుతోంది. ఈ రాయితీ అవకాశాన్ని జనవరి 10 వరకు మాత్రమే కల్పించారు. అయితే వాహనదారుల నుంచి మంచి స్పందన రావటంతో… గడువును జనవరి 31వ తేది వరకు పొడిగించారు. దీంతో ఇవాళ్టి వరకు రాయితీతో ట్రాఫిక్ చలాన్లను క్లియర్ చేసుకోవచ్చు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఈ రాయితీ వర్తించదని పోలీస్ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

ఆటోలు, ఫోర్ వీలర్లకు 60 శాతం, టూ వీలర్లకు 80 శాతం, ఆర్టీసీ బస్సులు ,తోపుడుబండ్లపై 90శాతం రాయితీ కల్పించింది. భారీ వాహనాల పై 50శాతం రాయితీని కల్పించింది. తెలంగాణ రాష్ట్రంలో రెండు కోట్లకు పైగా పెండింగ్ చలాన్లు ఉండడంతో ఈ మేరకు పోలీస్ శాఖ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement