Tuesday, November 26, 2024

TS: మేడారంకు ప‌గిడిద్ద‌రాజు…గుడిలో ప్ర‌త్యేక పూజ‌లు…

మేడారం జాత‌ర‌కు వేళైంది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతరగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మ క్క, సారలమ్మ జాతర కీలక ఘట్టానికి చేరుకుంది. జిల్లాలోని గంగారం మండలం పూనుగొండ్లలో పగిడిద్దరాజు గుడిలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈరోజు మధ్యాహ్నం పగిడిద్దరాజు మేడారం బయలుదేరనున్నారు. పగిడిద్దరాజును తీసుకుని కోయ పూజారులు అటవీ మార్గంలో కాలినడకన మేడారంకు బయలుదేరి వెళ్లనున్నారు. నేటి రాత్రికి పగిడిద్దరాజు మేడారం‌కు రానున్నారు.

- Advertisement -

జాతర కార్య‌క్ర‌మాలు ఇలా సాగ‌నున్నాయి…
తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన సమ్మక్క – సారలమ్మ మేడారం జాతర ఈనెల 21 నుంచి నాలుగు రోజుల పాటు ఘనంగా జరుగనుంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో రెండేళ్లకోసారి జరుగుతుంది. 2024 ఫిబ్రవరి 21న జాతర మొదలుకానుంది. జాతరకు ఒకరోజు ముందే పగిడిద్దరాజును మేడారంకు తీసుకువస్తారు. అనంతరం సారలమ్మ, గోవిందరాజును గద్దెకు తీసుకువస్తారు. ఫిబ్రవరి 22న సమ్మక్క దేవతను గద్దెకు తీసుకువస్తారు. ఫిబ్రవరి 23న భక్తులు మొక్కులు తీర్చుకుంటారు. ఫిబ్రవరి 24న దేవతల వనప్రవేశం ఉండగా… ఫిబ్రవరి 28వ జాతర పూజలు ముగింపు కార్యక్రమాలు ఉంటాయి.

కాగా, గత నెల రోజులుగా భక్తుల సందడితో సాగుతున్న జాతరలో గద్దెపై కొలువుదీరడానికి సమ్మక్క భర్త పగిడిద్దరాజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల మండలం, యాపలగడ్డ గ్రామం నుంచి పయనమయ్యారు. శతాబ్దాలుగా ఆయనకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న ఆరెం వంశీయులు గర్భగుడి వద్ద పడగలు, శివసత్తులకు పురాతన కాలం నాటి ఆభరణాలు అలంకరించి పూజారు లు (వడ్డెలు) భుజాన మోస్తూ కాలినడకన మేడారం బయలుదేరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement