రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ప్రభుత్వం ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో వరి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి అల్లోల ప్రారంభించారు. అలాగే ఇదే గ్రామంలోని మున్నూరు కాపు సంఘం వీడీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
రైతు వేదిక భవనంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి అల్లోల మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతులకు ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని, ఎల్లవేళలా రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం దృఢనిశ్చయంతో ఉందని అన్నారు. రైతులు ప్రభుత్వ ఆదేశాల అనుసారం పంట మార్పిడి పద్ధతిని అవలంబించాలన్నారు. అప్పుడే రైతులకు మద్దతు ధర వస్తుందని చెప్పారు మంత్రి అల్లోల. చాలాచోట్ల వరి పండించే పొలాల్లో చాలా రకాల పంటలను పంపిస్తున్నారని రైతులు కూడా అలాగే వరి తగ్గించి వేరుశరుగ, నువ్వులు తదితర పంటలను వేసి ముందుకు సాగాలని సూచించారు.
కార్యక్రమంలో టిఆర్ఎస్ రాష్ట్ర కన్వీనర్ సత్యనారాయణ గౌడ్ నాయకులు రామ్ కిషన్ రెడ్డి నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నర్మదా ముత్యంరెడ్డి జడ్పిటిసి జీవన్ రెడ్డి పిఎసిఎస్ చైర్మన్ కృష్ణ ప్రసాద్ రెడ్డి గ్రామ సర్పంచ్ టి వినోద్ కుమార్ ఉప సర్పంచ్ దాసరి రాజేశ్వర్ టిఆర్ఎస్ నాయకులు దాసరి శ్రీనివాస్ భువనగిరి నరసయ్య నరేష్ యూత్ ప్రెసిడెంట్ అంబేకర్ ప్రసాద్ వార్డు మెంబర్లు రైతులు వ్యవసాయ అధికారులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు