దత్తసాయిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాదయాత్రని చేపట్టారు. గండి రామన్న దత్తసాయి క్షేత్రం నుంచి కదిలి పాపహరేశ్వర్ దేవాలయం వరకు బుధవారం రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పాదయాత్ర చేపట్టారు. భక్తుల బృందంతో పాపహరేశ్వర్‌కు పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ లోక కల్యాణం కోసం గత ఆరేళ్లుగా ప్రతి శ్రావణ మాసం చివరలో సాయిదీక్షా సేవా సమితి అధ్యక్షుడు లక్కిడి జగన్మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ మహత్కార్యంలో పాలుపంచుకోవడం భగవత్ కృపగా భావిస్తున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలని, రైతులు, ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం సీఎం కేసీఆర్ సారథ్యంలో పెద్ద ఎత్తున ఆలయాలను అభివృద్ధి చేస్తున్నామని, నిర్మల్ నియోజకవర్గం కూడా ఆధ్యాతికంగా ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. కలెక్టరేట్ వద్ద కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూకీ పాదయాత్రకు సంఘీభావం ప్రకటించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement