హైదరాబాద్ – ఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియాగాంధీని లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయించాలని తెలంగాణ పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. సోమవారం గాంధీ భవన్లో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే అధ్యక్షతన పీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కన్వీనర్ షబ్బీర్ అలీ, సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. మరో నాలుగైదు నెలల్లో లోక్ సభ ఎన్నికలు రానున్నాయి. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడంతో తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో ఉత్సాహం కనిపిస్తోంది. లోక్ సభ ఎన్నికల్లో గతంలో రెండింతల స్థానాలు గెలుస్తామని ఆశాభావంతో ఉంది.ఈ నేపథ్యంలోనే తెలంగాణ నుంచి సోనియా గాంధీని పోటీ చేయించాలనే నిర్ణయం తీసుకున్నారు.. అలాగే తెలంగాణాలోని 17 లోక్ సభ స్థానాలకు అబ్జర్వర్లను ప్రకటించింది పాలిటికల్ అఫైర్స్ కమిటి.. . ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంలకు రెండు పార్లమెంటు నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించారు. సీఎం రేవంత్ రెడ్డికి చేవెళ్ల, మహబూబ్ నగర్ నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు ఆదిలాబాద్ లోక్ సభ నియోజకవర్గం బాధ్యతలు, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఖమ్మం, ఉత్తమ్ కుమార్ రెడ్డికి నల్గొండ, పొన్నం ప్రభాకర్ కు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించారు.
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు అబ్జర్వర్లు నియమించిన కాంగ్రెస్…
పార్లమెంట్ నియోజకవర్గాల ఏఐసీసీ అబ్జర్వర్లు
వరంగల్ – రవీంద్ర దాల్వి
జహిరాబాద్ – మేయప్పన్
నాగర్‌కర్నూలు – పీవీ మోహన్
ఖమ్మం – ఆరీఫ్ నసీంఖాన్
నల్లగొండ – రాజశేఖర్ పాటిల్
పెద్దపల్లి – మోహన్ జోషి
మల్కాజ్గిరి – రిజ్వాన్ అర్షద్
మెదక్ – యూబీ వెంకటేశ్
సికింద్రాబాద్ – రూబీ మనోహరన్
హైదరాబాద్ – భాయ్ జగదప్
భువనగిరి – శ్రీనివాస్
మహబూబాబాద్ – శివశంకర్‌రెడ్డి
ఆదిలాబాద్ – ప్రకాశ్ రాథోడ్
నిజామాబాద్ – అంజలీ నింబాల్కర్
మహబూబ్‌నగర్ – మోహన్ కుమార్ మంగళం
చేవెళ్ల – ఎం.కె. విష్ణుప్రసాద్
కరీంనగర్ – క్రిష్టోఫర్ తిలక్