Tuesday, November 19, 2024

Oxford University – కెసిఆర్ పాలన దేశానికే దిక్చూచి – ఎమ్మెల్సీ క‌విత

లండ‌న్ – తెలంగాణ భారతదేశానికే దిక్చూచిగా మారిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె.కవిత అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అతి తక్కువ సమయంలో తెలంగాణ అత్యంత వేగంగా అభివృద్ధి చెందిందని, రాష్ట్ర ప్రజల జీవితాలు మెరుగుపడ్డాయని అన్నారు. భారతదేశ సమగ్ర, స్థిరమైన అభివృద్ధికి తెలంగాణ బ్లూప్రింట్‌ గా మారిందని అన్నారు. బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో సోమవారం జరిగిన ‘ఇన్‌క్లూజివ్‌ డెవలప్‌మెంట్‌: తెలంగాణ మోడల్‌’ అనే అంశంపై కవిత కీలకోపన్యాసం చేస్తూ .. సీఎం కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ అభివృద్ధి నమూనా అని పేర్కొన్నారు.

చంద్రశేఖర్‌రావు మానవతా దృక్పథంతో పాలన సాగించడం వల్ల తెలంగాణ వేగవంతమైన, సమగ్రమైన అభివృద్ధిని సాధించిందని అన్నారు. సీఎం కేసీఆర్ అభినవ చాణక్యుడని అభివర్ణించారు. బీఆర్ఎస్ పాలనలో బంజరు భూములు పచ్చని పంటపొలాలుగా తీర్చిదిద్ది దేశానికి సీఎం కేసీఆర్ స్ఫూర్తినిచ్చారన్నారు. అలాగే తెలంగాణ శాంతి, మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిందని కవిత ఉద్ఘాటించారు. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో తరచూ మత ఘర్షణలను జరిగేవని అన్నారు.

సీఎం కేసీఆర్ హయాంలో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించినప్పటి నుండి ఒక్క మతపరమైన అల్లర్లను జరగలేదని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమం మధ్య పాటిస్తూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ బహుళ రంగాలలో అగ్రగామిగా ఉందని అన్నారు. అలాగే.. ప్రకృతి వనరులను సద్వినియోగం చేసుకోవడంలోనూ తెలంగాణ ముందు వరుసలో నిలిచిందని అన్నారు. తెలంగాణ మోడల్ అంటే ఆర్థికంగా కాదని, తెలంగాణ ప్రజల జీవన స్థితిగతులు కూడా పూర్తిగా మారాయని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement