వర్గల్, ప్రభ న్యూస్ : సొంత జాగలోనే ఇల్లు కట్టుకునే అవకాశాన్ని గజ్వేల్ నియోజకవర్గంలోని మాదారం గ్రామం నుంచి ప్రారంభిస్తున్నామని జిల్లా కలెక్టర్ వెంకట్రాంరెడ్డి వివరించారు. వర్గల్ మండలం మాదారం గ్రామంలో ఏకగ్రీవ గ్రామపంచాయతీ వద్ద సమావేశమై గ్రామ ప్రజలతో చర్చించారు. మాదారం గ్రామ ప్రజలకు రెవెన్యూ సమస్యలు కొన్ని ఉన్నమాట వాస్తవమేనని తనను ప్రజలు కోరినట్లు ఈ విషయమై గ్రామస్తులతో చర్చించి పరిష్కరించడానికే ఇక్కడికి వచ్చినట్లు వివరించారు. ధరణిలో నిక్షేపంకాని భూమి కొంత మేరలో ఉందని, ఆ సమస్యను నివారించేందుకు చర్యలు చేపడతామని చెప్పారు. దసరా తర్వాత ఒక రోజు మీసేవ ఆపరేటర్లతో కలిసి గ్రామస్తుల వద్ద అర్జీలు తీసుకోవాలని తహసీల్దార్ వాణిరెడ్డిని ఆదేశించారు. సొంత అడుగుజాగలోనే ఇల్లు కట్టుకునే అవకాశాన్ని మాదారం గ్రామం నుంచే ప్రారంభించడం ఎంతో సంతోషించాల్సిన విషయంగా వివరించారు. గ్రామాభివృద్ధికై రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు తెలుపడంతో పాటు గ్రామానికి కావాల్సిన ప్రతిపాదనలు గడా ప్రత్యేకాధికారికి పంపాలని సూచించారు. కార్యక్రమంలో గజ్వేల్ ఆర్డీఓ విజయేందర్‌రెడ్డి, గడా ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, వర్గల్ తహశీల్దార్ వాణి, మండల ప్రజాప్రతినిధులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement