Wednesday, November 20, 2024

Dharna : ఫారిన్ విద్యార్ధినికి లైంగిక వేధింపులు.. ఇఫ్లూలో కొనసాగుతున్న ఆందోళనలు

హైదరాబాద్‌ . ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్శిటీ (ఇఫ్లూ)లో ఇటీవల ఫారిన్ విద్యార్ధిని జరిగిన లైంగిక వేధింపులకు నిరసనలు కొనసాగుతున్నాయి..లైంగిక వేధింపులకు గురైన బాధితురాలికి న్యాయం చేయాలని కోరుతూ స్టూడెంట్స్ నిరాహార దీక్షకు దిగారు. వివరాలలోకి లోకి వెళితే గత నెల 16వ తేదిన ఫారిన్ విద్యార్ధినిపై లైంగికవేధింపులు వర్శిటీలో జరిగాయని స్వయంగా ఆ విద్యార్ధిని వెల్లడించింది..దీంతో ఆమెకు న్యాయం చేయాలని కోరుతూ విసిని కోరారు.. అయితే అటు నుంచి ఎటువంటి స్పందనలేకపోవడంతో ఆందోళన భాట పట్టారు.. అయినప్పటికీ స్పందించకపోవడంతో నవంబరు 6వ తేదీ నుండి హంగర్ స్ట్రైక్ చేపట్టారు.

స్టూడెంట్స్ పై పెట్టిన కేసులు ఎత్తివేయాలని, బాధితురాలికి న్యాయం జరిగేవరకు హంగర్ స్ట్రైక్ ఆపేది లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విప్లవాత్మక పాటలు పాడుతూ నిరసన చేస్తున్నారు. ఇఫ్లూ లో స్టూడెంట్స్ హంగర్ స్ట్రైక్ 6వ రోజు కు చేరుకుంది. గత 5రోజులు గా ఏమీ తినకుండా, క్లాసులకు వెళ్ళకుండా ఎంట్రెన్స్ గేటు దగ్గరే బైఠాయించి న్యాయం కోసం పోరాడుతున్నారు. యూనివర్సిటీ లో ఇలాంటి ఘోరమైన పరిస్థితులు జరుగుతున్నా కూడా, యాజమాన్యం ఎలాంటి చర్యలు తీస్కోవడం లేదు. హంగర్ స్ట్రైక్ చేస్తున్న స్టూడెంట్స్ ఆరోగ్యం నిలకడగా ఉంది, అయినా కూడా యాజమాన్యం నుండి ఎటువంటి స్పందన లేదు. అంతేకాకుండా దీక్షను భగ్నం చేసేందుకు క్యాంపస్ లో పోలీసులు ప్రవేశించారు.. ఏ క్షణంలో జరుగుతుందో తెలియిని పరిస్ధితులలో విద్యార్ధులు భయం భయంగా ఉంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement