హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఈనెల 21వ తేదీ నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఉస్మానియా విశ్వవిద్యాలయం పరీక్షల విభాగం కంట్రోలర్ ప్రొ.నగేష్ తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీఎస్‌డబ్ల్యూ కోర్సుల్లో 2, 4, 6 సెమిస్టర్లు చదువుతున్న రెగ్యులర్ విద్యార్థులతో పాటు బ్యాక్లాగ్ పరీక్షల తేదీలను ప్రకటించారు. ఉస్మానియా పరిధిలో 410 డిగ్రీ కాలేజీ విద్యార్థులకు 350 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
దాదాపు 4 లక్షల 84వేల 291 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. పరీక్ష తేదీల కోసం వర్సిటీ వెబ్‌సైట్‌ని సంప్రదించాలని సూచించారు. పరీక్షలు వాయిదా పడతాయంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.