హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో బంగారు పెద్ద ఎత్తున పట్టుబడుతోంది. విదేశాల నుంచి వచ్చేవారు దురాశతో బంగారాన్ని తీసుకొస్తూ పట్టుబడిపోతున్నారు. ఇవ్వాల ఓ వ్యక్తి ఏకంగా స్పీకర్లలో దాచి కస్టమ్స్ అధికారుల కళ్లుకప్పే యత్నం చేశాడు. అయినా అధికారులు దొరకపట్టేశారు..
బంగారం ధర పెరుగుతుండడంతో విదేశాల నుంచి అక్రమంగా బంగారాన్ని దాచిపెట్టి తీసుకొస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పేందుకు స్మగ్లర్లు కొత్త కొత్త మార్గాలను కనుగొంటున్నారు. ఇక.. బంగారాన్ని స్ప్రే రూపంలోకి మార్చి, చీరపై చల్లి తీసుకొస్తూ అడ్డంగా దొరికిన ఘటనలున్నాయి. ఇవ్వాల (ఆదివారం) స్పీకర్లు, ఇస్త్రీ పెట్టెలో పెద్ద ఎత్తున బంగారాన్ని తీసుకొచ్చిన ఇద్దరు ప్రయాణికులను శంషాబాద్ ఎయిర్ పోర్ట్ అధికారులు పట్టుకున్నారు. ఇట్లా పట్టుబడ్డ బంగారం విలువ దాదాపు రూ.కోటికి పైనేనని ఉంటుందని సమాచారం.