తెలంగాణలో మరో 8 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. సీఎం కేసీఆర్ ముందస్తు ఆలోచనా విధానంలో భాగంగా ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ ఉండాలన్నది లక్ష్యంగా ఉంది. కాగా, దీనిపై ఇప్పటికే ప్రభుత్వం వేగవంతమైన చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో ఇవ్వాల ఎనిమిది కొత్త మెడికల్ కాలేజీలకు ప్రభుత్వం అనుమతులు, నిధులు మంజూరు చేస్తూ జీవో జారీ చేసింది. దీనిలో భాగంగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలో 168 కోట్ల అంచనా వ్యయంతో 100 ఎంబీబీఎస్ సీట్ల సామర్ధ్యంతో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు కానుంది. దీనికి సంబంధించి అనుందంఘా ఉండే ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని కూడా మంజూరు చేస్తూ G.O MS NO 97 ని విడుదల చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి అందుకున్నారు. పేదల ఆరోగ్యంపై శ్రద్ద చూపుతున్న సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
భూపాలపల్లి మెడికల్ కాలేజీకి ఉత్తర్వులు.. సీఎం నుంచి జీవో కాపీ అందుకున్న ఎమ్మెల్యే గండ్ర
Advertisement
తాజా వార్తలు
Advertisement