Monday, October 7, 2024

TG |పెన్షన్ రికవరీలపై వెనక్కి తగ్గిన ప్రభుత్వం..

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. పింఛన్ రికవరీలను నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రికవరీ నోటీసులపై ప్రభుత్వం అధికారులకు క్లారిటీ ఇచ్చింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనర్హులకు లబ్ధి, రికవరీపై చర్చించాలని నిర్ణయించినట్లు సీఎస్ శాంతి కుమార్ తెలిపారు.

సంక్షేమ పథకాల్లో అనర్హులు లబ్ధిపొందినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని, అర్హులకు మాత్రమే లబ్ధి చేకూరేలా త్వరలోనే స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేస్తామన్నారు. మార్గదర్శకాలు జారీ చేసే వరకు రికవరీ నోటీసులు ఇవ్వొద్ద‌ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

కాగా, వృద్ధులను ఆదుకునేందుకు కేసీఆర్ ప్రభుత్వం అంజేసిన‌ ఆసరా పింఛన్లను వెనక్కి తీసుకునేందుకు… కాంగ్రెస్ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా శనివారం నాటికి 1,826 మందికి రికవరీ నోటీసులు జారీ చేసినట్లు ప్రకటించింది. పింఛన్లు తొలగించనున్న 1,826 మంది జాబితాను రాష్ట్ర స్థాయి అధికారులు ఇప్పటికే జిల్లాలకు పంపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement