హైదరాబాద్ నగరంలోని ఇందిరాపార్క్‌లో అఖిలపక్షం మహాధర్నా నిర్వహిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా అఖిలపక్షం ధర్నాకు దిగింది. సాయంత్రం 5 గంటల వరకు ధర్నా కొనసాగనుంది. మహా ధర్నాకు ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. మూడు వ్యవసాయ బిల్లులు, పెట్రోల్, డీజిల్.. నిత్యావసరాల ధరల పెరుగుదలను వ్యతిరేకిస్తూ, ఉపాధి హామీ పని దినాలు, కూలి ధరల పెంపు తదితర డిమాండ్లపై ధర్నా చేపట్టాయి. జాతీయ స్థాయిలో విపక్ష పార్టీలు తీసుకున్న నిర్ణయం మేరకు బీజేపీ, టీఆర్‌ఎస్ యేతర పార్టీల మహాధర్నా చేస్తున్నాయి. ఈ మహాధర్నాలో కాంగ్రెస్, టీజేఎస్, సీపీఎం, సీపీఐ, టీడీపీ, సీపీఐ ఎంఎల్ లిబరేషన్, ఎంఎల్ న్యూ డేమోక్రసి, ప్రజా సంఘాలు పాల్గొన్నాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement