ఆంధ్రప్రభ బ్యూరో : రాష్ట్రంలో ఏప్రిల్ 15 వరకు కొత్తగా ఓటు #హక్కు నమోదు చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఈలోగా జాబితాలో ఓటు ఉందో? లేదో? పరిశీలించుకుని.. లేని పక్షంలో నమోదు చేసుకోవాలని సూచించింది. ఇతర ప్రాంతాల నుంచి తెలంగాణకు వచ్చిన వారు లేదా ఇప్పటి వరకు ఓటు నమోదు చేసుకోని వారు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎన్నికల సంఘం తెలిపింది. ఓటరు నమోదు నిరంతర ప్రక్రియ అని ఏటా జనవరి, ఏప్రిల్, జులై, అక్టోబరు నెల ఒకటో తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన వారు ఓటుకు దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్నికల సంఘం ప్రకటించి ఎప్పటికప్పుడు జాబితాలు వెలువరిస్తోంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement