హైదరాబాదులోని ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ (ఎల్వీపీఈఐ) హైదరాబాద్ ప్రాంగణం (కల్లం అంజిరెడ్డి ప్రాంగణం)లో ఒక అత్యాధునిక ఆఫ్థాల్మిక్ రిసర్చ్ బయోరిపోజిటరీ కేంద్రం ఏర్పాటయ్యింది. దేశంలో ఇటువంటి సౌకర్యం ఉన్న మొట్టమొదటి సంస్థ ఎల్వీపీఈఐ కావడం విశేషం. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ రిటైర్డ్ డీన్ ప్రొఫెసర్ క్రొత్తపల్లి రవీంద్రనాథ్ ఉదారమైన మద్దతుతో ఈ కేంద్రం స్థాపించబడింది. ప్రొఫెసర్ రవీంద్రనాథ్ ఎల్వీపీఈఐకి దీర్ఘకాలంగా శ్రేయోభిలాషిగా, మద్దతుదారుగా ఉన్నారు. ఈసందర్భంగా ఎల్ వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ ప్రొఫెసర్ బ్రియన్ హోల్డెన్ ఐ రిసర్చ్ సెంటర్ (బీహెచ్‌ఈఆర్సీ) నెట్ వర్క్ డైరెక్టర్ డా. సయన్ బసు మాట్లాడుతూ… ఎల్వీపీఈఐలో నేత్రవైద్య పరిశోధనకు మద్దతునివ్వడంలో ఉదార మద్దతును, ఎంతో ఆసక్తి కనపరచిన ప్రొఫెసర్ క్రొత్తపల్లి రవీంద్రనాథ్ కు తాము ఎంతో కృతజ్ఞులమన్నారు. భద్రపరచబడిన ఈ టిష్యూల అధ్యయనం అంధత్వానికి దారితీసే వ్యాధుల వినూత్న, పురోగమన చికిత్సలకు ఎంతగానో సహాయపడుతుందన్నారు. ఇది (ఎ) అమూల్యమైన రోగి నమూనాల భద్రత, పరిశుద్ధత (బి) సాధారణ, అరుదైన వ్యాధుల అణుసంబంధిత నిర్మాణాలను మరింత మెరుగ్గా అర్ధం చేసుకోవడాన్ని అభివృద్ది చేయడం, (సి) అరుదైన కంటి వ్యాధుల నిర్వహణకు సరికొత్త పరిజ్ఞానాలతో ముందుకు రావడంలో ఇది సహాయపడుతుందన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital