తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో రేపు హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియం వేదికగా.. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు.. ఈ ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ అగ్రనేతలను ఆహ్వానించిన రేవంత్ తాజాగా తన ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చూసేందుకు తరలిరావలసిందిగా తెలంగాణ ప్రజలందరికీ పిలుపు ఇచ్చారు.. ఈ మేరకు ఆయన బహిరంగ లేఖ విడుదల చేశారు.. ఇదే సందర్బంగాద అమరవీరుల కుటుంబాలకు సైతం ఆయన స్వయంగా ఆహ్వానం పంపారు..
Open Invitation – మీ సిఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నా…అందరూ రండి…రేవంత్ ప్రజలకు పిలుపు
తెలంగాణ ప్రజలకు అభినందనలు.. విద్యార్థుల పోరాటం, అమరుల త్యాగం, సోనియాగాంధీ ఉక్కు సంకల్పంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మనందరి ఆకాంక్షలు నెరవేర్చే ఇందిరమ్మ రాజ్య స్థాపనకు సమయం ఆసన్నమైంది.. రాష్ట్రంలో ప్రజాస్వామ్య, పారదర్శక పాలన అందించేందుకు, బడుగు, బలహీన వర్గాలు, దళిత, గిరిజన, మైనారిటీ, రైతు, మహిళ, యువత సంక్షేమ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మీ అందరి ఆశీస్సులతో 2023 డిసెంబర్ 7వ తేదీన మధ్యాహ్నం 1.04 గంటలకు హైదరాబాద్ ఎల్బీ సేడియంలో ప్రజా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయబోతోంది.. మీ అందరికీ ఇదే ఆహ్వానం..
Advertisement
తాజా వార్తలు
Advertisement