Friday, September 20, 2024

Tomcom | మన స్టూడెంట్స్ కి మంచి చాన్స్.. జర్మనీలో నర్సింగ్ జాబ్స్

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: జర్మనీలో నర్స్‌ ఉద్యోగాలతో పాటు మూడేళ్ల నర్సింగ్‌ డిగ్రీ కోర్స్‌ చదివేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలంగాణ ఓవర్సీస్‌ మ్యాన్‌పవర్‌ కంపెనీ లిమిటెడ్‌(టామ్కామ్‌) ఒక ప్రకటనలో తెలిపింది. జర్మనీలో ఆరోగ్య సంరక్షణ కార్మికులకు ముఖ్యంగా నర్సులకు అధిక డిమాండ్‌ ఉన్నందున నర్సింగ్‌లో 3 ఏళ్ల ఇంటర్నేషనల్‌ డిగ్రీని పొందేందుకు అవకాశాలను అందిస్తోందన్నారు.

ఆ తర్వాత నెలకు రూ.2 నుండి 3 లక్షల వరకు ఆకర్షణీయమైన జీతం ప్యాకేజీతో నర్సుగా ఉద్యోగం హామీ ఇస్తుందన్నారు. అభ్యర్థులు చదువుకునే సమయంలో 3 ఏళ్ల పాటు నెలకు రూ.1 లక్ష స్టయిఫెండ్‌ పొందనున్నట్లు తెలిపింది. కనీసం 60శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత సాధించడంతో పాటు 18 నుండి 30 ఏళ్ల వయస్సు గల అభ్యర్థులు అర్హులని తెలిపింది. ఎంపికైన అభ్యర్థులను జర్మనీలో ఉంచడానికి ముందు హైదరాబాద్‌లో జర్మన్‌ భాషలో ఆరు నెలల రెసిడెన్షియల్‌ శిక్షణ అందించబడుతుందని టామ్కామ్‌ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement