ప్రభన్యూస్ : రెండేళ్ల నర్సింగ్ కోర్సులో ప్రవేశాలకు కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ మేరకు రెండు రోజుల కిందట నోటిఫికేషన్ విడుదలైంది. ఆన్లైన్లో అప్లికేషన్లు స్వీకరిస్తున్నట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. ఈనెల 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు, సర్టిఫికెట్లను స్వీకరిస్తామని చెప్పారు. తాత్కాలిక అర్హుల జాబితా, కౌన్సిలింగ్ షెడ్యూల్, తరగతుల నిర్వహణ తేదీలను త్వరలో ప్రకటిస్తామని యూనివర్సిటీ స్పష్టం చేసింది.
అడ్మిషన్ల ప్రక్రియను ఇండియన్ నర్సింగ్ కౌన్సిలింగ్ మార్గదర్శకాల ప్రకారం నిర్వహిస్తామని పేర్కొన్నారు. విద్యా ర్థులు మరిన్ని వివరాల కోసం సంస్థ వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు. ఈ రెండేళ్ల నర్సింగ్ కోర్సు పూర్తిగా విద్యార్థినులకే పరిమితమని స్పష్టం చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital