Tuesday, November 26, 2024

తెలంగాణలో నేటి నుంచి ఆన్ లైన్ క్లాసులు..

కరోనా ఉధృతి నేపథ్యంలో తెలంగాణలో KG టు PG విద్యార్థులకు ఆన్‌లైన్‌ విధానంలోనే క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అందుకు తగ్గట్లుగానే ఆ రోజు నుంచి రాష్ట్రంలో ఆన్‌లైన్ క్లాసులు జరగనున్నాయి. ఇందుకు తగ్గ ఏర్పాట్లు చేసింది విద్యాశాఖ. దీంతో వేసవి సెలవులు ముగిసిన తరువాత విద్యార్థులంతా మళ్ళీ ఆన్‌లైన్‌ క్లాసులకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే ప్రతి విద్యార్థి టీశాట్ యాప్ డౌన్‌లోడ్ చేసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు విద్యాశాఖ అధికారులు.. ప్రతి విద్యార్థి ఆన్ లైన్ తరగతులకు హాజరయ్యే విధంగా విద్యార్థుల తల్లిదండ్రులు.. విద్యార్థులతో మాట్లాడి కావాల్సిన సహాయం చేయాలని టీచర్లు, స్కూల్ హెడ్‌ మాస్టర్లకు విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర వరకు సబ్జెక్టుకు 30 నిమిషాల చొప్పున క్లాసులు డీడీ యాదగిరి, టీశాట్‌లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.

ఇది కూడా చదవండి:నిలకడగా కరోనా కేసులు: దేశంలో కొత్తగా 48 వేల మందికి కోవిడ్

Advertisement

తాజా వార్తలు

Advertisement