Friday, November 22, 2024

ఆన్‌లైన్‌లో బోనం .. ఉజ్జయినీ, బల్కంపేట అమ్మవార్లకు సమర్పించే సదుపాయం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : భక్తులు ఉజ్జయినీ మహంకాళీ అమ్మవారికి ఆన్‌లైన్‌లోనూ బోనాలు సమర్పించేందుకు అవకాశం కల్పించినట్లు రాష్ట్ర దేవాదాయశాఖా మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం అరణ్య భవన్‌లో ఆన్‌లైన్‌ సేవలను ప్రారంభించారు. ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుంటే ఆలయ నిర్వహకులే అమ్మవారికి బోనం సమర్పిస్తారని, గోత్రనామాలతో పూజలు చేసి అమ్మవారి ప్రసాదం నేరుగా ఇంటికి పంపిస్తారని చెప్పారు. పోస్టు ద్వారా బోనంలోని బియ్యాన్ని ప్రసాదంలా పంపిణీ చేస్తారని, వాటిని ఇంటి వద్దే వండుకుకుని ప్రసాదంలా స్వీకరించొచ్చన్నారు. బియ్యంతోపాటు బెల్లం, అక్షింతలు, పసుపు-కుంకుమ పంపిస్తారని చెప్పారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ఆన్‌లైన్‌లో బోనం సమర్పించే భక్తులకు జులై 4 నుంచి ఈ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు.

టీఏపీపీ ఫోలియో, మీ సేవ, ఆలయ వెబ్‌సైట్‌, పోస్టు ఆఫీస్‌ ద్వారా దేశ, విదేశీ భక్తులు ఈ సేవలను బుక్‌ చేసుకోవచ్చని పేర్కొన్నారు. దేశీయ భక్తులు రూ.300, అంతర్జాతీయ భక్తులు రూ.1000 చెల్లించాల్సి ఉంటుందన్నారు. వీటిని పోస్టు ఆఫీస్‌, ఆర్టీసీ కొరియర్‌ సేవల ద్వారా దేశీయ భక్తులకు ఇంటికి చేరుస్తారని వెల్లడించారు. కాగా… ప్రసిద్ధ బల్కంపేట ఎల్లమ్మ తల్లి కల్యాణ ఆన్‌లైన్‌ సేవలను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రారంభించారు. బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం జులై 5న వైభవంగా నిర్వహిస్తామన్నారు. జులై 4 లోగా భక్తులు ఆన్‌లైన్‌ కల్యాణం సేవలను బుక్‌ చేసుకోవాలని తెలిపారు. ఈ ఆన్‌లైన్‌ సేవలకుగాను రూ.500 చెల్లించాల్సి ఉంటుందన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement