తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. హత్య కుట్ర ఏ విధంగా ప్లాన్ చేశారనే దానిపై లోతైన దర్యాప్తు చేయనున్నారు. ఈ కేసుకు సంబంధించి ఏడుగురు నిందితులను నాలుగు రోజుల పాటు పోలీసుల కస్టడీకి మేడ్చల్ కోర్టు అనుమతించింది. బుధవారం పేట్ బషీరాబాద్ పోలీసులు నిందితులను కస్టడీకి తీసుకుని విచారణ చేయనున్నారు. ఎనిమిది మంది నిందితులతో పాటు మిగిలిన వ్యక్తుల ప్రమేయంపై విచారణ జరపనున్నారు. ఇప్పటికే మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి పీఏ జితేంద్ర రాజుకు నోటీసులు జారీ చేశారు. పోలీసులు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ జితేంద్ర రాజు హైకోర్టును ఆశ్రయించిన విషయం విదితమే. నిందితులను పోలీసులు నాలుగు రోజుల పాటు విచారణ చేయనున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement