హైదరాబాద్, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో కరోనా నాలుగోవేవ్ పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. కరోనా వేరియంట్లలో మార్పులు వస్తుండడంతో రోజువారీ వైరస్ కేసులు పెరుగుతున్నాయి. వరుసగా రెండో రోజూ 500కి చేరువగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా 496 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు తెలంగాణలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 7,98,621కి చేరింది. కరోనా నుంచి కోలుకోవడంతో మరో 205 మంది వివిధ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు.
వారం, పది రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నా రాష్ట్రంలో కరోనాతో మరణాలు నమోదు కాలేదు. కరోనా బారిన పడడంతో చికిత్స పొందుతున్న యాక్టివ్ కేసుల సంఖ్య 3613కి చేరింది. గడిచిన 24 గంటల వ్యవథిలో రాష్ట్ర వ్యాప్తంగా 28, 808 మందికి కరోనా టెస్టులు చేశారు. తాజాగా నమోదైన కరోనా కేసుల్లో 341 కేసులు ఒక్క హైదరాబాద్ నగరంలోని నమోదయ్యాయి. ఖమ్మంలో5, మేడ్చల్ మల్కాజిగిరిలో 40, రంగారెడ్డిలో 68, సంగారెడ్డిలో 15 అత్యధిక కరోనా కేసులు నమోదయ్యాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.