హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో ట్రాన్స్‌పోర్ట్, నాన్ ట్రాన్స్‌పోర్ట్ ఆటో డ్రైవర్‌లు,హోంగార్డులు, వర్కింగ్ జర్నలిస్టులకు సామాజిక భద్రత స్కీమ్‌ను మరో ఏడాది పాటు ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది మార్చి 31తో స్కీమ్ ముగియనుండగా మరో ఏడాది పాటు దీనిని పొడిగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపారు.
స్కీమ్‌లో భాగంగా ప్రమాదవశాత్తు మరణించిన ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్, వర్కింగ్ జర్నలిస్టులకు రూ.5 లక్షలను ప్రభుత్వం అందజేస్తుంది. ఈ స్కీమ్‌కు అర్హులైన వారి పేర్లను అటు ట్రాన్స్‌పోర్టు కమిషనర్ నుంచి ఇటు సమాచార శాఖ కమిషనర్ నుంచి కార్మిక శాఖ సేకరిస్తుంది. స్కీమ్‌కు బీమా సేవలందించే ఏజెన్సీని కాంపిటీటివ్ బిడ్డింగ్ పద్ధతిద్వారా నిర్ణయించనున్నట్లు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.