Saturday, November 16, 2024

One Nation, One Election – జ‌మిలీ ఎన్నిక‌ల‌కు కేంద్రం గ్రీన్ సిగ్న‌ల్…

వ‌న్ నేష‌న్ – వ‌న్ ఎల‌క్ష‌న్ కు కేంద్ర కేబినేట్ ఆమోదం
ప్ర‌ధాని మోదీ అధ్య‌క్ష‌త‌న నేడు కేంద్ర కేబినెట్ భేటి
324ఎ, 325 అధిక‌ర‌ణ‌లు స‌వ‌రణకు నిర్ణ‌యం

న్యూఢిల్లీ – కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్‌పై రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని నివేదికను కేబినెట్ ఆమోదించింది. ఈ శీతాకాల సమావేశాల్లో పార్లమెంటు ఉభయ సభల్లో బిల్లు ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లుకు ఆమోద ముద్ర ల‌భించిన‌ట్ల‌యితే దీంతో ఇక లోక్ స‌భ‌, అన్ని రాష్ట్రాల శాస‌న స‌భ‌ల‌కు ఏక‌కాలంలో ఎన్నిక‌లు నిర్వ‌హిస్తారు. దీనికోసం 324ఎ, 325 అధిక‌ర‌ణ‌లు స‌వ‌ర‌ణ చేయాల్సి ఉంది.. దీనికి కూడా కేబినేట్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది..

ఈ రామ్‌నాథ్ కోవింద్ క‌మిష‌న్ ఇచ్చిన నివేదికలో ఇచ్చిన సూచనల మేరకు తొలి దశగా లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించనున్నారు. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగిన 100 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలను కూడా నిర్వహించాలని కమిటీ సిఫార్సు చేసింది. దీంతో దేశం మొత్తం నిర్ణీత వ్యవధిలో అన్ని స్థాయిల్లో ఎన్నికలు నిర్వహించవచ్చు. ప్రస్తుతం నాలుగు రాష్ట్రాలు… ఆంధ్ర ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశాలో ఒకేసారి లోక్ సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగగా… మిగతా రాష్ట్రాల్లో ఒకేసారి పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు జరగడం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement