మెదక్, (ప్రభన్యూస్) : స్వయం ఉపాధి కల్పనలో భాగంగా గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న పురుషులకు ద్విచక్ర వాహన మెకానిజంలో నెల రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నామని స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా కేంద్రం సంచాలకులు వంగా రాజేంద్రప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అయితే అభ్యర్థులు మెదక్, సంగారెడ్డి జిల్లాలకు చెందిన వారై 18 నుండి 45 సంవత్సరాలలోపు వయస్సు కలిగి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలని అన్నారు.
ఇది కూడా చదవండి : సినీ ఫక్కీలో నగదు చోరీ.. బైకు ట్యాంకు కవర్ లో పెట్టి తీసుకెళ్తుంటే..
ఈ నెల 31 నుండి ప్రారంభమయ్యే టూవీలర్ మెకానిక్ శిక్షణా కాలంలో అభ్యర్థులకు ఉచిత భోజన వసతి పాటు రాను పోను బస్ చార్జీలు చెల్లిస్తాని ఆయన తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ విద్యార్హత దృవపత్రాలతో పాటు తెల్లరేషన్‌కార్డు, ఆధార్ కార్డు, 4 పాస్‌పోర్టు సైజ్ ఫోటోలతో సంగారెడ్డిలోని బైపాస్ రోడ్‌లో గల స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా కేంద్రంలో సంప్రదించవలసినదిగా ఆయన సూచించారు. వివరాలకు 9490103390 లేదా 9490129839 ఫోన్ నెంబర్ల ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital