Thursday, September 19, 2024

TG: ఐదేళ్లలో లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

మహిళా సంఘాలకు సోలార్ పవర్ ప్లాంట్ లు
పెద్దపల్లి, ఆంధ్రప్రభ : రాబోయే ఐదేళ్లలో మహిళా సంఘాలకు లక్ష కోట్ల రూపాయల వడ్డీరేని రుణాలను అందిస్తామని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలియజేశారు. శనివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రగతి సభలో మాట్లాడుతూ… ప్రతి ఏడాది మహిళా సంఘాలకు 20వేల కోట్ల రూపాయల వడ్డీలేని రుణాలు అందిస్తామన్నారు. మహిళలను మహారాణులుగా చేసేందుకు మహిళా సంఘాలచే సోలార్ పవర్ ప్లాంట్ లు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. అందులో ఉత్పత్తి అయిన కరెంటును ప్రభుత్వమే కొనుగోలు చేసి వారికి అదనపు ఆదాయం చేకూరుస్తుందన్నారు.

ఉచిత బస్సు ప్రయాణానికి ప్రభుత్వం ప్రతినెలా ఆర్టీసీకి 400 కోట్ల రూపాయలు చెల్లిస్తుందన్నారు. 200 యూనిట్ల కరెంటుకు జీరో బిల్లు అందిస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో ప్రతిపాక రిజర్వాయర్ కు నిధులు కేటాయించి పనులు ప్రారంభిస్తామన్నారు. రామగుండంలో ఎనిమిది వందల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ కు పదివేల కోట్ల రూపాయలను త్వరలోనే మంజూరు చేసి పనులు ప్రారంభిస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో ఐటి శాఖ మంత్రి దుదిల్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, ఎంపీ వంశీకృష్ణ, పెద్దపల్లి రామగుండం ఎమ్మెల్యేలు విజయ రమణారావు, మక్కాన్సింగ్ లతోపాటు ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement