హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంలో అతి పెద్ద పరిశ్రమగా ఉన్న సింగరేణి ఇప్పటికే తగినంత బొగ్గు, విద్యుత్ అందిస్తూ రాష్ట్ర అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తోందని సింగరేణి సీఎండీ శ్రీధర్ అన్నారు. రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా అత్యుత్తమ వృద్ధి నమోదు చేస్తున్న ప్రభుత్వ సంస్థల్లో ఒకటిగా నిలిచిందన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. వచ్చే ఐదేళ్లలో 100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి, 3 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధన దిశగా కృషి చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఎనిమిదేళ్లలో రాష్ట్ర అభివృద్ధి చెందుతున్న విధంగానే సింగరేణి సంస్థ కూడా బొగ్గు ఉత్పత్తి, రవాణా, అమ్మకాలలో అత్యుత్తమ వృద్ధిని నమోదు చేసుకుని మిగతా కంపెనీలకు ధీటుగా నిలబడిందని శ్రీధర్ తెలిపారు. గతంలో 11 వేల కోల టర్నోవర్ ఉంటే.. ఇప్పుడు 26 వేల కోట్లకు పెరిగిందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..