Friday, November 22, 2024

ఒకప్పుడు మిగులు బడ్జెట్, ఇప్పుడు అప్పుల కుప్ప.. తెలంగాణ ప్రభుత్వంపై ఎంపీ లక్ష్మణ్ విమర్శలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఒకప్పుడు మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు రూ. 3.5 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని బీజేపీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ విమర్శించారు. మంగళవారం రాజ్యసభలో ధరల పెరుగుదలపై జరుగుతున్న చర్చల్లో పాల్గొన్న ఆయన తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ చేసి రూ. 30 వేల కోట్ల ప్రాజెక్టును రూ. 1.2 లక్షల కోట్లకు ప్రాజెక్టు వ్యయాన్ని పెంచారని లక్ష్మణ్ ఆరోపించారు. ఇటీవల వరదలు వస్తే ప్రాజెక్టు మొత్తం మునిగిపోయిందని, దానివల్ల ఎలాంటి ఉపయోగమూ లేదని చెప్పుకొచ్చారు.

యూపీ తరహాలోనే తెలంగాణలో డబులింజన్ సర్కారు వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరల్లో రాష్ట్ర పన్నుల వాటాయే ఎక్కువని అన్నారు. లక్ష్మణ్ ప్రసంగంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు ప్రస్తావించడంతో ఆ వ్యాఖ్యలను రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు రికార్డుల నుంచి తొలగించారు. సభలో లేని వ్యక్తుల గురించి ప్రస్తావించడం సభా నిబంధనలకు విరుద్ధమైనందున రాజ్యసభ ఛైర్మన్ రూలింగ్ ఇచ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement