తన పుట్టిన రోజు సందర్భంగా ఎవరూ హంగామా చేయొద్దని, హడావిడి కార్యక్రమాలతో డబ్బు ఖర్చుపెట్టొద్దని మంత్రి కేటీఆర్ తెలిపారు. అంతేకాకుండా వరదలతో ఇబ్బంది పడుతున్న వారికి, ఇతర అత్యవసర పరిస్థితులున్న వారికి ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమం ద్వారా ఆదుకోవాలని కోరారు. ఈ పిలుపుతో ముందుకు వచ్చారు ఖమ్మం టీఆర్ఎస్ లీడర్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. ఈ మధ్య గోదావరి వరదలతో నష్టపోయిన దాదాపు 15వేల మంది కుటుంబాలకు సాయం చేయాలని డిసైడ్ అయ్యారు.
ఖమ్మం మాజీ ఎంపీ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహకారంతో పీఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి బూర్గంపాడు, భద్రాచలం మండలాల్లో గిఫ్ట్ ఏ స్మైల్ ప్రోగ్రామ్ నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా సుమారు కోటి రూపాయల విలువైన నిత్యావసర సరుకులను పంపిణీ చేయనున్నారు. కార్యక్రమంలో టీ ఆర్ ఎస్ పార్టీ ప్రజా ప్రతినిదులు, నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొనాలను ఖమ్మం జిల్లా డీసీసీబీ చైర్మన్ తుళ్లూరి బ్రహ్మయ్య కోరారు.