Tuesday, November 26, 2024

మాస్టర్ ప్లాన్ రద్దుపై.. రైతుల ఆందోళనలు ఉద్ధృతం

తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి, జ‌గిత్యాల‌, నిజామాబాద్ రైతులు మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలంటూ ఆందోళ‌న‌లు ఉధృతం చేశారు. భూములు కాపాడుకోవడం కోసం పండుగ రోజు సైతం రోడ్డెక్కిన అన్నదాతలు ఈరోజు కూడా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల, నిజామాబాద్ రహదారిపై ధర్నాకు దిగారు. మున్సిపల్ కమిషనర్, జిల్లా కలెక్టర్ వచ్చి తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇండస్ట్రియల్ జోన్ నుంచి తమ భూములను కాపాడాలని నినాదాలు చేశారు. రోడ్డుపై ధర్నా చేయడంతో భారీగా ట్రాఫిక్ జాం అయింది. దీంతో పోలీసులు రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. మాస్టర్ ప్లాన్కు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న రైతులకు సర్పంచులు మద్దతు తెలుపుతున్నారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేయకపోతే రాజీనామాకు సైతం సిద్ధమని అధికార పార్టీ సర్పంచులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement