పొరుగు రాష్ట్రంలో సభ నిర్వహణ సిద్ధమవుతోంది బిఆర్ఎస్ పార్టీ. ఫిబ్రవరి 5న నాందేడ్ లో సభను నిర్వహించబోతోంది. ఈ సభకు మహారాష్ట్ర ప్రజలతో పాటు, రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న తెలంగాణ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరవుతారని బీఆర్ఎస్ నేతలు చెపుతున్నారు. మరోవైపు నాందేడ్ సభ ఆవిర్భావ ఏర్పాట్లను ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పరిశీలించారు. ఈ సందర్భంగా షిండే మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు మహారాష్ట్ర ప్రజలు ఆకర్షితులవుతున్నారని చెప్పారు. జాతీయ పార్టీగా ఎదిగిన బీఆర్ఎస్ కు ఇక్కడి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. పేరు మార్చుకుని జాతీయ పార్టీగా అవతరించిన టీఆర్ఎస్ పార్టీ జోరు పెంచుతోంది. ఖమ్మంలో ఇటీవల తొలి ఆవిర్భావ సభను భారీగా నిర్వహించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement