దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. అయితే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే 14 ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. రిస్క్ దేశాల నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వస్తున్న వారికి ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహిస్తుండగా పలువురికి పాజిటివ్‌గా వస్తోంది. ఒమిక్రాన్ అనుమానితుల నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపిస్తున్నారు. ఈ క్రమంలో కొత్తగా 14 మందికి కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నిర్ధారణ అయ్యింది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 38కి చేరుకుంది. రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital