అసోం రోడ్డు రవాణా సంస్థ నుంచి 100 ఎలక్ట్రిక్ బస్సుల కోసం ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లెటర్ ఆఫ్ అవార్డు అందుకుంది. ఈశాన్య రాష్ట్రాల నుంచి కంపెనీకి ఇదే తొలి ఆర్డర్. ఔట్ రైట్ కొనుగోలు ప్రాతిపదికన ఈ ఆర్డర్ లభించింది. వచ్చే తొమ్మిది నెలల్లో ఈ బస్సులను కంపెనీ డెలివరీ చేయనుంది. అలాగే, ఐదేండ్ల పాటు బస్సుల మెయింటెన్స్ కూడా ఒలెక్ట్రానే చేయనుంది. ఈ వంద బస్సుల ఆర్డర్ విలువ రూ. 151 కోట్లుగా ఉంది.
ఈ సందర్బంగా ఒలెక్ట్రా గ్రీన్ టెక్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కేవీ. ప్రదీప్ మాట్లాడుతూ, “ఈశాన్య రాష్ట్రా లు, అసోం నుంచి తొలిసారిగా ఆర్డర్ రావడం సంతోషంగా ఉంది. ఈ ఆర్డర్‌తో దేశం నలుమూలల మా బస్సులు నడుస్తున్నట్టు అవుతుంది. మా బస్సులు ఇప్పటికే దేశీయ రోడ్ల పై 5 కోట్ల కిలోమీటర్లకు పైగా నడిచి కార్బన్ కాలుష్యాలను గణనీయంగా తగ్గించగలిగాయి.” అని వ్యాఖ్యానించారు.