Thursday, October 3, 2024

భారీ పెట్టుబ‌డితో ఒలెక్ట్రా గ్రీన్.. తెలంగాణ‌లో ప‌రిశ్ర‌మ ఎర్పాటు..

విద్యుత్‌తో నడిచే బస్సులు తయారు చేసే ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్‌ హైదరాబాద్‌ శివార్లలో ఎలక్ట్రిక్‌ బస్సులు, ట్రక్కుల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కంపెనీ ప్రతినిధులు రాష్ట్ర పరిశ్రమల శాఖ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. రూ.600 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ఈ పరిశ్రమలో విద్యుత్‌తో నడిచే బస్సులతో పాటు ట్రక్కులు, వాణిజ్య అవసరాలకు వినియోగించే త్రీ-వీలర్‌ వాహనాలను తయారు చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఒలెక్ట్రా గ్రీన్‌ కంపెనీ తయారు చేసిన విద్యుత్‌ బస్సులను తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టులో వాడుతున్నారు. ఎలక్ట్రిక్‌ వాహనాలకు సంబంధించిన సాంకేతికతను చైనాకు చెందిన విద్యుత్‌ వాహనాల తయారీ దిగ్గజం బీవైడీ కంపెనీ ఒలెక్ట్రాకు అందజేస్తోంది. విద్యుత్‌ వాహనాల తయారీకి ఇటీవల తెలంగాణ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా భారీ రాయితీలు ప్రకటించడంతోనే కంపెనీ తన సామర్థ్యాన్ని విస్తరించడానికి పెట్టుబడులు పెడుతోందని అధికారులు చెబుతున్నారు. ఒలెక్ట్రా వద్ద ఇప్పటికే రూ.2వేల కోట్ల రూపాయల విలువైన బస్సుల తయారీకి ఆర్డర్లున్నట్లు కంపెనీ పలు సందర్భాల్లో వెల్లడించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement