Thursday, November 21, 2024

వృద్ధురాలి హత్య – 24 గంటల్లోపే చేదించిన మీర్ పేట్ పోలీసులు

ఎల్బీనగర్ ఆగస్టు 19 ( ప్రభ న్యూస్). వృద్ధురాలని హత్య చేసిన సంఘటనలో 24 గంటల లోపే నిందితున్ని పట్టుకొని మీర్ పేట్ పోలీసులు రిమాండ్ తరలించారు. ఈ హత్యకు సంబంధించిన వివరాలను వనస్థలిపురం ఏసీపీ భీమ్ రెడ్డి ఆయన కార్యాలయంలో శనివారం సాయంత్రం విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

బి భోజ్జమ్మ,(58) భర్త లక్ష్మయ్య తో కలిసి మీర్ పేట్ ఇండో అమెరికన్ స్కూల్లో వాచ్మెన్ గా పనిచేస్తుంది. నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం ఇంద్రకల్ గ్రామానికి చెందిన బోజ్జమ్మ చెల్లెలి కొడుకు ఆంజనేయులు ( 40 )అలియాస్ జాను శివ పాత నేరస్తుడు. అప్పుడప్పుడు భోజ్జమ్మ దగ్గరికి వచ్చి వెళుతుండేవాడు. తాగుడుకు బానిసైన ఆంజనేయులు జులాయిగా తిరుగుతుండడంతో భార్య కూడా వదిలిపెట్టింది. సులభంగా డబ్బు సంపాదించాలన్న ఆలోచనలతో పెద్దమ్మ భోజ్జమ్మ పై ఉన్న నగలపై అతని కన్ను పడింది.

17వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో రూమ్ లో ఉన్న సుత్తితో ఆమె తలపై బాది చంపాడు. ఆమెపై ఉన్న ఐదు గ్రాముల బంగారం 60 తులాల కాళ్ళ వెండి కడియాలు తీసుకొని ఆమె చీరకు నిప్పంటించి పరారయ్యాడు. రూమ్ లో నుండి మంటను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు

- Advertisement -

. క్లూస్ టీం తో వివరాలు సేకరించిన పోలీసులు ఆంజనేయులుపై అనుమానంతో నాగర్ కర్నూలుకు వెళ్లి అతని విచారించగా నేరం అంగీకరించాడు. అతని వద్ద ఉన్న ఐదు గ్రాముల బంగారం 60 తులాల వెండి కడియాలను స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు. గతంలో ఆంజనేయులు ద్విచక్ర వాహనాల దొంగతనం కేసులో జైలుకు వెళ్లినట్లు కూడా తెలిపారు.హత్య కేసును 24 గంటల్లోపే ఛేదించిన మీర్పేట్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ ,డి ఐ గౌరీ నాయుడు సిబ్బందిని రాచకొండ సిపి డిఎస్ చౌహన్, ఎల్బీనగర్ డిసిపి సాయిశ్రీ గౌడ్, వనస్థలిపురం ఏసిపి భీమ్ రెడ్డిలు అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement