Friday, November 22, 2024

అందరూ ఉన్నా అనాధ శవం!

కుటుంబంలో ఎవరైనా చనిపోయినా కడసారి చూపుకు, అంత్యక్రియలకు వెళ్లలేని దారుణమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. చనిపోయిన వ్యక్తి కాటికి తీసుకెళ్లేందుకు నలుగురు మనుషులు కరువైన పరిస్థితి కనిపిస్తోంది. మహమ్మారి వైరస్ పేరు చెబితేనే…జనం హడలెత్తి పోతున్నారు. ఏ క్షణాన ఎవరికి తగులుకుంటుందోనని భయపడి చస్తున్నారు. కరోనా సోకి మరణించిన వారి అంత్యక్రియల విషయంలో చాలామంది ప్రజలు మానవత్వం అనేది ఒకటుంటుందని కూడా మరచిపోతున్నారు. చనిపోయింది తమకు సుపరిచితుడైనా…ఇరుగుపొరుగువాడైనా.. కనికరించడం లేదు. తాజాగా నిజామాబాద్ జిల్లాలో దారణం ఘటన వెలుగు చూసింది.

అనారోగ్యంతో మృతి చెందిన ఓ మహిళను ఖననం చేసేందుకు బంధువులు ముందుకు రాలేదు. కన్నతల్లిని కడసారి చూసేందుకు కొడుకులు రాని పరిస్థితి. కరోనా దెబ్బకు భయపడి బంధువులు ఎవరూ ఆమెను చూసేందుకు రాలేదు. అందరూ ఉన్నా అనాధ శవంగా వృద్ధురాలు మిగిలిపోయింది. ప్రగతినగర్ స్మశాన వాటికలో నిన్న ఉదయం నుంచి వృద్ధురాలి మృతదేహం పడి ఉంది. కంటేశ్వర్ కు చెందిన ముగ్గురు వ్యక్తులు ఆటోలో తీసుకొచ్చి వదిలేశారని వాచ్ మెన్ చెపుతున్నాడు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement