- ఇతర పంటలతో పోలిస్తే రైతులు ఆయిల్ ఫామ్ పై మొగ్గు చూపెడుతున్నారు
- 30 సంవత్సరాల పాటు రైతుకు ప్రతినెలా ఆదాయం
ఇంద్రవెల్లి : అదిలాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని రైతులు నానా పంటలు వేసి, ప్రకృతి వాతావరణం సహకరించక, కూలీల సహకారం లేక, పెరుగుతున్నా రసాయినిక ఎరువులు పిచికారి మందులు పొలాల్లో దుప్పి దున్ని పెట్టే ఖర్చులు ఆదాయానికి సమానంగా ఉండడంతో రైతులు ఎండనకా, చలి, వర్షంలో కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో ఈ ప్రాంత రైతులు తమ పొలాల్లో ఆయిల్ ఫామ్ సాగు వైపు ముందుకు వస్తున్నారు రైతులు. పండించే ముఖ్య పంటల్లో పత్తి, సోయా మక్కా, గోధుమ, తదితర పంటలు పండించినా అటు ప్రభుత్వ కొనుగోలు ఉన్నా సమయానికి డబ్బులు రాక దళారీ వ్యవస్థ రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డ్రిప్, రసాయన ఎరువులకు, ఆర్థిక ప్రోత్సాహాలు, ప్రభుత్వ సబ్సిడీతో మొక్కలు అందిస్తూ రైతులకు సహాయ సహకారాలు అందిస్తుంది. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో సుమారు 2300 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగులో ఉంది. ఇటీవల టన్ను గెలల ధర రూ.20,413కి పెరిగింది. ఒకే సంవత్సరంలో సుమారు 7వేల రూపాయలు పెరిగింది. పెరిగిన ధరల వలన సుమారు ఎకరాకు లక్ష రూపాయల ఆదాయం రైతుకు సమకూరుతుంది. జిల్లాలోని నేలలు, వాతావరణం ఆయిల్ పాం సాగుకు అత్యంత అనుకూలం. ఒకసారి పంట వేస్తే 4వ సంవత్సరం నుంచి మొదలుకొని 30సంవత్సరాల వరకూ వస్తుంది.
ఆయిల్ పామ్ సాగుకు కావలసిన మొక్కలు 90శాతం రాయితీపై, నీటి వసతి కోసం డ్రిప్ పరికరాలు ఎస్సీ ఎస్టీలకు 100శాతం రాయితీ, బీసీ, ఇతర కులాలకు 90రాయితీపై ప్రభుత్వం నుంచి అందించబడతాయి. అంతేగాక ఎకరానికి పెట్టుబడి, అంతర పంటల సాగుకోసం ఎకరాకు 4200 రూపాయలు ప్రభుత్వం సహాయం అందిస్తుంది. కావున జిల్లా, ఏజెన్సీ రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉద్యాన అధికారి ఎస్.సుధాకర్ ఉద్యాన అధికారులు క్రాంతి, అలేఖ్య తెలిపారు.