Friday, September 13, 2024

Rains: అధికారులు సెలవులు పెట్టొద్దు.. వర్షాలపై సీఎం రేవంత్ సమీక్ష

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్ష నిర్వహించారు. కలెక్టర్లు, ఎస్పీలు, రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు 24 గంటలు క్షేత్రస్థాయిలో పర్యటించాలని… అధికారులు సెలవులు పెట్టొద్దని ఆదేశించారు. లీవ్ అప్లై చేసిన వారు వెంటనే రద్దు చేసుకొని పనుల్లో నిమగ్నం కావాలని చెప్పారు. అత్యవసర విభాగాల అధికారులు క్షేత్రస్థాయి సమాచారాన్ని ఎప్పటికప్పుడు సీఎంఓ కు అందించాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

తెలంగాణలో మరో 24 గంటల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడతాయని రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కాగా, రాష్ట్రవ్యాప్ంగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. హైదరాబాద్ లోనూ భారీ ఎడతెరిపి లేకుండా వానలు పడుతుండటంతో రేపు స్కూళ్లకు సెలవు ప్రకటించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement