Tuesday, November 26, 2024

TG: అధికారులు రాజ్యాంగ బద్దంగా వ్యవహరించాలి.. ఈటెల రాజేందర్

ప్రభ న్యూస్ ప్రతినిధి, మేడ్చల్, సెప్టెంబర్ 4: జిల్లా అధికారులు పక్షపాత రహితంగా పథకాలను ప్రజల వద్దకు తీసుకుపోవాల్సిన అవసరం ఉందని మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. బుధవారం మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ లో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆధ్వ‌ర్యంలో వార్త లాప్ మీడియా వర్క్ షాప్ నిర్వ‌హించారు.

ఈ వర్క్ షాప్ ను ప్రారంభించిన అనంతరం ఈటెల మాట్లాడుతూ… అధికారులు రాజ్యాంగ బద్దంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ ఎమ్మెల్యే ఛామకూర మల్లారెడ్డి, జిల్లా కలెక్టర్ గౌతం, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అడిషనల్ డెరైక్టర్ జనరల్ శృతి పాటిల్, ఎమ్మెల్యేలు వివేక్, మాధవరం కృష్ణా రావ్, మేడ్చల్ జిల్లా ఇన్చార్జి డి.పి.ఆర్.వో స్వర్ణలత, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement