ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.హైదరాబాద్‌ను విముక్తి చేసిన అమరవీరులను స్మరించుకునేందుకు, యువతలో దేశభక్తిని నింపేందుకు భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీని హైదరాబాద్ విమోచన దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది.ఈ మేరకు గెజిట్‌ను విడుదల చేసింది.
”భారత్ స్వాతంత్య్రం పొందాక హైదరాబాద్ సంస్థానం 13 నెలల పాటు నిజాంల పరిపాలనలోనే ఉంది. 1948 సెప్టెంబర్ 17న పోలీస్ చర్య ‘ఆపరేషన్ పోలో’తో ఈ ప్రాంతం భారత్‌లో విలీనమైంది. సెప్టెంబర్ 17న ‘హైదరాబాద్ విమోచన దినం’ నిర్వహించాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్‌కు విముక్తి కల్పించిన అమరవీరులను స్మరించుకోవడానికి, యువతలో దేశభక్తి నింపడానికి సెప్టెంబర్ 17న ‘హైదరాబాద్ విమోచన దినం’ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది” అని హోం మంత్రిత్వశాఖ నోటిఫికేషన్‌లో పేర్కొంది.
కాగా, గత కొన్నేళ్లుగా సెప్టెంబర్ 17వ తేదీన హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని కేంద్రం నిర్వహిస్తున్నారు. సికింద్రాబాద్ పేరెడ్ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నలోక్‌సభ ఎన్నికల వేళ సెప్టెంబర్ 17కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వంనిర్ణయించింది. సెప్టెంబర్ 17న అధికారిక కార్యక్రమాలు నిర్వహించాలని గెజిట్‌లో పేర్కొంది. ఇకపై సెప్టెంబర్ 17వ తేదీని విమోచన దినోత్సవంగా నిర్వహించనున్నారు.