దేశరాజధాని ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోసం అధికారిక నివాసం సిద్ధమైంది. తుగ్లక్ రోడ్ 23లోని అధికారిక నివాసానికి చిన్నచిన్న మరమ్మతులు చేసి పూర్తిగా సిద్ధం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరుతో ఉన్న నేమ్‌ప్లేట్‌ను తొలగించి దాని స్థానంలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రేవంత్‌రెడ్డి పేరుతో నేమ్‌ప్లేట్ ఏర్పాటు చేశారు. రేవంత్‌కు కేటాయించిన ఈ ఇంట్లో కేసీఆర్ దాదాపు 20 సంవత్సరాలపాటు ఉన్నారు.
2004లో కేంద్రమంత్రి హోదాలో కేసీఆర్ ఈ ఇంటికి మారారు. ఆ తర్వాత ఉద్యమ నేత, సీఎంగా ఈ ఇంటిని కొనసాగించారు. ఇప్పుడు అధికారం కోల్పోవడంతో ఖాళీ చేయక తప్పలేదు. కేసీఆర్‌కు సంబంధించిన వస్తువులను ఆ ఇంటి నుంచి ఇటీవలే అధికారులు తరలించారు.